
న్యూఢిల్లీ బ్యూరో : వైజాగ్ స్టీల్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు కొనసాగుతున్న ఉద్యమానికి ఢిల్లీలో పని చేస్తున్న తెలుగు కార్మికులు మద్దతు ప్రకటించారు. ఢిల్లీ ఘజీయాబాద్ సమీపంలోని జెండాపూర్‌లో తెలుగు కార్మికులు పనిచేస్తున్న పలు పారిశ్రామిక వాడల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి బుధవారం నాడు పర్యటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 'శాఖ ఉక్కు ా ఆంధ్రుల హక్కు మహోద్యమం' గురించి ఈ సందర్భంగా ఆమె వారికి వివరించారు. ప్రయివేటీకరణతో ఉద్యోగుల జీవితాలకే ప్రమాదమేర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి తమ మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా అక్కడి తెలుగు కార్మికులు ప్రకటించారు. 1970 తరువాత తామంతా ఆంధ్రా నుంచి ఢిల్లీకి వచ్చామన్నారు. ఎక్కుమ మంది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామని వివరించారు. కార్మికులను కలిసిన వారిలో ఢిల్లీ సిపిఎం కమిటీ కార్యదర్శి కెఎన్ తివారి, తెలుగు కార్మికులు డి లోక్‌నాత్, దామోదర్, పరమేశ్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.