Jul 06,2023 08:27
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పిహెచ్‌డి తప్పనిసరనేే నిర్ణయం రద్దు

న్యూఢిల్లీ : అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి పీహెచ్‌డీలను తప్పనిసరి చేయాలనే తన నిర్ణయంపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. అయితే, నెట్‌, సెట్‌, ఎస్‌ఎల్‌ఈటీ వంటి పరీక్షలు పోస్టుకు ప్రత్యక్ష నియామకానికి కనీస ప్రమాణాలు అని అధికారులు తెలిపారు. ''అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకం కోసం పీహెచ్‌డీ అర్హత ఐచ్ఛికంగా కొనసాగుతున్నది. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎన్‌ఈటీ), స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎస్‌ఈటీ), స్టేట్‌ లెవెల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎస్‌ఎల్‌ఈటీ)లు అన్ని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కోసం ఈ పోస్టుకు నేరుగా రిక్రూట్‌మెంట్‌ చేయడానికి కనీస ప్రమాణాలు'' అని యూజీసీ చైర్మెన్‌ ఎం. జగదీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.