Jun 08,2023 21:55
  • ఎంఫిల్‌ను నిలిపివేయాలి
  • పరిశోధనతో నాలుగేళ్ల యుజి డిగ్రీలు ఆనర్స్‌
  • సైన్స్‌ యేతర సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌
  • యుజిసి నిపుణుల కమిటీ సిఫార్సులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కోర్సు కనీస వ్యవధితో సంబంధం లేకుండా, అవసరమైన అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎబిసి)లతో డిగ్రీలు ప్రదానం చేయాలనియూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అవసరమైన ఎబిసిలతో విద్యార్థి సర్టిఫికేట్‌, డిప్లొమా, డిగ్రీ వంటి అర్హతల అవార్డు కోసం పరిగణించబడవచ్చని పేర్కొంది. ఉనుత విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకుకొత్త నామకరణంపై ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫార్సులను గురువారం యుజిసి విడుదల చేసింది. ప్రోగ్రామ్‌లో పరిశోధనా భాగాలు పొందుపరచబడి ఉంటే, 'ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌' అనే నామకరణంతో యుజి డిగ్రీలను ప్రదానం చేయడం సిఫార్సులలో ఉనాుయి. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌ మొదలైన సైన్స్‌-యేతర సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ లేదాబిఎస్‌ డిగ్రీలను అందజేయాలి. దీనిప్రకారం, అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యుజి) స్థాయిలో స్పెషలైజేషన్‌ లేదాప్రధాన సబ్జెక్ట్‌ విషయంలో విద్యార్థులకుఅందించే డిగ్రీ సర్టిఫికేట్‌లోనిప్రోగ్రామ్‌ నామకరణానిు ''బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ స్పెషలైజేషన్‌'' అనికూడా రాయొచ్చనికమిటీ తెలిపింది.

విశ్వవిద్యాలయాలు ఒకటి, రెండు సంవత్సరాల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లకు, కళలు, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, మానవీయ శాస్త్రాలు వంటి విభాగాలకుకూడా 'మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్‌)' నామకరణానిు అనుసరించవచ్చనిసూచిస్తునాుయి. దీనితో పాటు ఎంఫిల్‌ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలనికమిటీ సిఫార్సు చేసింది. సైన్సెస్‌, ఇంజనీరింగ్‌, టెకాులజీ, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యుజి), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పిజి) స్థాయిలలోనిఅనిు విభాగాలకుఈ నామకరణం వర్తిస్తుంది. మాస్టర్స్‌ ఏడాదికి అనుమతి ఇవ్వాలని, అంతర్జాతీయ నిబంధనలకుఅనుగుణంగా డిగ్రీలు ఉండాలనిసూచించింది. నిపుణుల కమిటీ తన తాజా సిఫార్సులకుఅనుగుణంగా నామకరణానిు సవరించే కసరత్తును చేపట్టేందుకు, అవసరాల ఆధారంగా సంబంధిత నియంత్రణ అధికారుల నుండి నామినీలతో ఒక స్టాండింగ్‌ కమిటీనిఏర్పాటు చేయాలనికోరింది. ఈ సిఫార్సులపై విశ్వవిద్యాలయాలు సలహాలను పంపవచ్చనికమిటీ తెలిపింది.