Aug 03,2023 08:14

న్యూఢిల్లీ: దేశంలో 20 యూనివర్సిటీలను నకిలీవిగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యుజిసి) బుధవారం ప్రకటించింది. అలాంటి యూనివర్సిటీలు ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో చెరో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు తెలిపింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరులోని కాకుమానివారితోటలో క్రైస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, విశా ఖలోని బైబిల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఇండి యాను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది.