Feb 19,2023 16:00

కుంచనపల్లి : రచయిత రాజబాబు కంచర్ల రాసిన 'ఉదయ వీచికలు' 20వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం 3:30గంటలకు ప్రజాశక్తి భవన్ లో పుస్తకావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేయునున్నసభలో ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్ శర్మ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రజాశక్తి ఎడిటర్ బి తులసీదాస్ అధ్యక్షతన నిర్వహించే ఈ సభలో ముఖ్య అతిధులుగా ప్రజాశక్తి సిజిఎం వై అచ్యుత్ రావు, ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్  ఎస్ వెంకట్రావు, ప్రజాశక్తి బుక్ హౌస్ జిఎం కె లక్ష్మయ్య లు పాల్గొనున్నారు.