Sep 24,2023 08:48

జయతి లోహితాక్షన్‌ గారి నాల్గవ పుస్తకం 'దిమ్మరి' కానీ యాత్రా రచనగా వర్గీకరించలేము. నిజానికి ఈ పుస్తకమే కాదు జయతి గారు రాసిన ఏ పుస్తకమూ ఫలానా అని వర్గీకరించలేము. ఎందుకంటే ఒక బౌద్ధ జెన్‌ (్గవఅ) లాగ జయతి ఆమె భర్త లోహి దశల వారీగా చేస్తున్న ఒక అనంత ప్రయాణం. జయతి గారు దిమ్మరి పుస్తకానికి ముందు రాసిన మూడు పుస్తకాల గురించి సాహితీవేత్త వాడ్రేవు చిన్నవీరభద్రుడు గారు ''అడవి నుంచి అడవికి' తో మొదలై 'మనం కలుసుకున్న సమయాలు' దాకా ఆమెలో ఒక తపస్వి, సౌందర్య ఆరాధకురాలు, ఒక ప్రకృతి ప్రేమికురాలు కనిపిస్తారు. అందుకనే ఆమెను రజూఱతీఱ్‌బaశ్రీ వషశీశ్రీశీస్త్రఱర్‌ అని అన్నాను. కానీ ఈ పుస్తకం (దిమ్మరి) వేరు. ఇందులో ఒక విరాగి కాదు. రాగమయి కనిపిస్తుంది. ఒక ప్రేమ సముద్రాన్ని గుండెలో మోసుకుంటూ తిరుగుతున్న ప్రేమికురాలు కనిపిస్తుంది. ఒక తల్లి కనిపిస్తుంది. ఒక చెల్లి, ఒక అక్క, ఒక క్లాస్‌మేట్‌, ఒక సహచరి, ఒక క్షమామూర్తి, చివరికి 'నగపాదాలు' అనే రచనలో ఆమె కోపం కూడా కనిపిస్తుంది'' అంటారు. కానీ నిజానికి ఇవన్నీ జయతి తన ప్రయాణంలో వదిలేసుకున్న గుణాలు. కొన్ని ఘటనల వలన ఆమె మరో ప్రాంతానికి తరలిపోవాల్సి వచ్చింది. కానీ అదే రచనలో జయతి 'నాలుగ్గోడలనుంచి తనని తాను విసిరేసుకున్న వాడికీ, ఒట్టికాళ్ళతో నడిచినవాడికీ, దేనినీ సొంతం చేసుకోని వాడికి మాత్రమే సృష్టిలో అందం నిజమైన ఆనందం కనిపిస్తుందని అంటూనే.. ఒక పూట తింటానికి మించి కూడబెట్టుకుంటున్న ఏ మనిషైనా ప్రకృతికి హాని చేస్తాడు' అని నిర్ద్వందంగా అంటారు. ఈ మాట చురుక్కుమని తగిలినా నిజానికి అది నిజం. అదే నిజం.
ఏ వృక్షమైనా, ఎంత చిన్న జంతువైనా ప్రకృతి పరిరక్షణకి పరోక్షంగా ఎంత తోడ్పడుతున్నాయో, మనకు పరోక్షంగా ఎంత ఉపకారం చేస్తున్నాయో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే.. మన మీద మనకే సిగ్గేస్తుంది. ఆ సత్యాన్ని అంతరాత్మ వరకూ ఆకళింపు చేసుకున్న వ్యక్తులు జయతి, లోహీలు. అందుకనే ప్రాణం ఉన్న దేనికీ ఏ హానీ చేయకుండా జీవిస్తున్నారు.
జయతి గారిని 'దిమ్మరి' పుస్తకం గురించి ఇంటర్వ్యూ చేస్తూ 'మీరు లోహి గారు ఈ విధమైన జీవన విధానం ఎన్నుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా?' అని అడిగాను. ఆ ప్రశ్నకు ఆమె 'మేమిలా వఙశీశ్రీఙవ అవుతూ వచ్చాం. డబ్బుతో అవసరం లేకుండా జీవించాలి అనుకున్నాం. బతకడానికి మనకి ఏం కావాలి, ఎంత కావాలి అనేవి మాకు స్పష్టమవుతూ వచ్చింది' అన్నారు. జయతి రాసిన మొదటి పుస్తకం అడవి నుంచి అడవికి నుంచి 'దిమ్మరి' వరకూ రాసిన నాలుగు పుస్తకాలు, లోహి ఆంగ్లంలో రాసిన దీఱషyషశ్రీవ ణఱaతీఱవర చదివితే ఆ దిశగా వారిద్దరూ చేసిన, చేస్తున్న ప్రయాణ క్రమం మనకు అవగతమవుతుంది.
ఇది చదవగానే చాలా మందికి మరి జయతి గారు పుస్తకాలు ఎందుకు రాస్తున్నారు? సంపాదన కోసం కాదా? అన్న ప్రశ్న తలెత్తడం ఎంతో సహజం. మొదటి పుస్తకం 'అడవి నుంచి అడవికి' ముందు ఫేస్‌బుక్‌లో మాత్రమే రాసేవారు. దాన్ని కూడా వివరిస్తూ 'ఏదైనా అనుభవమైనప్పుడు నా మనసులో ముద్ర పడిపోతుంది. రాయడానికి సమయం కుదిరినప్పుడు.. మనసులోకి తిరిగి చూసుకుంటాను. కల్పితం రాయలేను. అది నా చేతకాదు. రాయాలనిపించాక రాయకుండా ఉండలేకపోయినా, రాస్తున్నప్పుడు కలిగే మంచి అనుభవమే నేను రాసేలా చేసేవి' అనడమే కాకుండా '.......మా అవసరం ఆహారం మాత్రమే. అడవిలో కొంత, పుస్తకాల వల్ల కొంత సమకూరేది. రాయడం ఒక అవసరంగానూ మారలేదు నాకు. ఫోటో తియ్యాలనిపించినట్టే రాయాలనిపించి రాసేదాన్ని' అంటారు.
జయతి లోహీల వఙశీశ్రీఙవ చేసుకున్న జీవన విధానం కావాలనుకుంటే వచ్చేది కాదు. అలా జీవించడం అంత సులభమూ కాదు. కానీ ఆ రచనల పఠనం మనలో మానవత్వాన్ని, కరుణనీ, దయనీ, నింపుతుంది. వారిలా జీవించడం సాధ్యం కాకపోయినా.. మనలో చేతనైన, వీలైన పరిధిలోనైనా కాస్త మార్పులు చేసుకుందాం అన్న ఒక ఆలోచన తప్పక అంకురిస్తుంది. కారణం ఆ జీవనశైలికి వారిద్దరూ ప్రత్యక్ష సాక్షులు కావటమే. రాతలకూ చేతలకూ మధ్య వైరుధ్యం లేకపోవటమే. జయతి గారు మొదటి పుస్తకం 'అడవి నుంచి అడవికి' ప్రచురణ గురించి చెబుతూ 'పాఠకులకి ఇష్టమవుతున్న కొద్దీ వాళ్ళ స్పందనలని బట్టి ఒక పుస్తకం అచ్చువేస్తే ్‌ఱఎవశ్రీవరర గా ఉండిపోతుంది అనిపించింది నాకు' అన్నారు. కానీ ఆ పుస్తకంతో పాటు జయతి గారి అడవి పుస్తకం, మనం కలుసుకున్న సమయాలు, దిమ్మరి కూడా ్‌ఱఎవశ్రీవరర గా ఉండిపోయే పుస్తకాలే.

- ఆర్‌.ఎస్‌. వెంకటేశ్వరన్‌.
79824 50256

 

దిమ్మరి: జయతి లోహితాక్షన్‌
ప్రచురణ : మట్టి ముద్రణలు
నెం: 9848015364 :
వెల : 200/-