బీజింగ్ : తాలిమ్ టైఫూన్ మరోసారి చైనా తీరాన్ని తాకింది. ఈ ఏడాదిలో ఇది నాలుగో తుఫాను అని చైనాకి చెందిన గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ మంగళవారం పేర్కొంది. తాలిమ్ టైపూన్ వియత్నం దిశగా వెళుతున్నట్లు గుర్తించారు. సుమారు గ్వాంగ్వీలోని బీహై నగరంలో మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు తుఫాను తీరాన్ని తాకిందని, ఉదయం తొమ్మిది గంటల సమయంలో క్వీన్‌జౌ నగరానికి చేరుకుందని ప్రాంతీ వాతావరణ శాఖ పేర్కొంది. టైఫూన్ కేంద్రానికి సమీపంలో గరిష్ట గాలి వేగం సెకనుకి 24 మీటర్లకు చేరుకుందని, గంటలకు 15 నుండి 20 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతుందని అంచనా వేసింది. క్విన్‌జౌ, ఫాంగ్ చెంగ్‌గాంగ్, చోంగోజువో నగరాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
దీంతో 2,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని నేషనల్ మెటరలాజికల్ సెంటర్ (ఎన్‌ఎంసి) తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుండి బుధవారం 8 గంటల వరకు గ్వాంగ్ డాంగ్, ఫుజియాన్, హునాన్, గుయిజౌ మరియు యునాన్ ప్రాంతాలతో పాటు దక్షిణ చైనాలోని మరికొన్ని ప్రాంతాలోల భారీ వర్షాలు కురవవచ్చని హెచ్చరించింది.










