- పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి
ప్రజాశక్తి - వేంపల్లె : నిరుద్యోగ యువతకు ద్రోహం చేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు దొందు దొందేనని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయాని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోఢీ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వం కూడ భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వం పారిశ్రామిక వ్యతిరేక చర్యల వల్ల ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. నిధులు లేని కారణంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్లు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడం లేదన్నారు. ఖాళీగా ఉన్న 10 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను కూడ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయాలని కోరారు. ప్రయివేటు రంగంలో ఉపాధి ఉద్యోగాలు పెంచాలని కోరారు. స్వయం ఉపాధి పథకాలు కూడ ఎక్కువగా పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీకాలం గరిష్ట పరిమితి 62 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు.










