- టీడీపీ ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ అందిస్తే జగన్ రెడ్డి 11 లక్షల మందికి కుదింపు
- స్టిక్కర్లు పెట్టే ఖర్చు విద్యార్ధులకు పెట్టేందుకు చేతులు రావడం లేదా?
- పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
- టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్
ప్రజాశక్తి-అమరావతి : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయినా జగన్ రెడ్డి మాత్రం గత ఏడాది ఫీజ్ రీయంబర్స్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలు రోడ్డునపడ్డాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బీటెక్ 4వ ఏడాది విద్యార్ధులకు 8వ సెమిస్టర్ పరీక్షలు ముగిసినా జగన్ రెడ్డి మాత్రం 2023-24కు కేవలం ఒక్క విడతే చెల్లించారు. మిగిలిన 3 విడతలు ఇంత వరకు చెల్లించలేదు. అదే విధంగా 2021-22 విద్యా సంవత్సరానికి ఆఖరి విడత విడుదల చేయలేదు. మొత్తంగా 4 విడతలు పెండింగ్ లో పెట్టారు. అంతే కాకుండా వసతి దీవెన పథకం కింద ఇంకా 3 విడతలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఫీజ్ రీయంబర్స్ మెంట్ పెండింగ్ లో పెట్టడంతో విద్యార్ధులకు కళాశాల యాజమాన్యం నోటీసులు పంపుతున్నారు, హాల్ టిక్కెట్లు ఇవ్వడం లేదు, సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్ధులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 11 లక్షల మందికి కుదించింది. పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఫీజ్ రీయంబర్స్ మెంట్ నిలిపివేస్తూ జీవో నెం77ను విడుదల చేశారు. దీనితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈ పథకం నిలిపివేతతో వారి ఉన్నత చదువుల కలను చెరిపివేశారు. జగన్ రెడ్డి ప్రచార పిచ్చిలో భాగంగా స్టిక్కర్లకు డబ్బులుంటున్నాయి గాని విద్యార్ధుల బకాయిలకు డబ్బులు లేవా? మా విద్యార్ధుల జీవితాలతో ఆటలాడితే పరిస్థితి ఎలాగ ఉంటుందో మొన్న గ్రాడ్యువేట్ ఫలితాలే ఉదాహరణ. విద్యార్ధులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే మాత్రం సీఎం ఇంటిని ముట్టడిస్తాం.










