ప్రజాశక్తి-చిలకలూరిపేట : జంపని శ్రీ హారిబాబు(72)కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి పందారిపురంలో 8వ లైన్లో గల తన స్వహృహ మందు అకాల మృతి చెందారని సుదూర ప్రాంతాల నుంచి బంధువులు రావాల్సి ఉన్నందున శుక్రవారం మధ్యాహ్నము అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. ఈయన రిటైర్డు కెమిస్తూ ఉపాధ్యాయులు, వామపక్ష ఉద్యమాల్లో విరి కుటుంభం షుమారుగా 30 సంవత్సరం నుంచి పని చేశారని సిపిఎం సీనియర్ నాయకులు బొల్లు శంకర్రావు గురువారం పార్థివదేహానికి పూలమాల వేసి ఘానా నివాళ్ళు అర్పించారు. శంకర్రావు మాట్లాడుతూ ఈయన పెదనందిపాడులో తేళ్ల నారాయణ విఘ్నా కేంద్రానికి, పాలపర్రులో అభివృద్ధి కార్యకలపాలం న్నిటికి తన వంతుగా సహాయ, సహకారాలు ఇచ్చారన్నారు. జనవిజ్ఞాన వేదికలో ప్రారంభం నుంచి పని చేశారన్నారు. ఇంకా ఆయన పని చేసిన కళాశాలల్లో తన శక్తి మేర మంచినీళ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి సహాయ సహాకారాలు అందించారన్నారు. సిపిఎంకి పూర్తి మద్దతుదారుగా జీవిత కాలం ఉన్నారని బొల్లు శంకర్రావు అన్నారు. శ్రీ హరిబాబు మృతదేహాన్ని సందర్శించిన వారిలో సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు,తియ్యగుర ప్రతాప్ రెడ్డి, పెదనాందిపాడు మండల కా ర్యదర్శి దొప్పలపూడి రమేష్ బాబు,నూత లపాటి కాళిదాసు, కె.శ్రీనివాస రెడ్డి, ఏ.వి. శివయ్య,దార్ల బుచ్చి బాబు,వివికె సురేష్, ముత్తవరపు రవీంద్ర బాబు, పోపూరి సుబ్బా రావు,మానుకొండు ఉపేంద్ర జంపని రామా రావు తదితరులు పాల్గొని ఘన నివాళ్ళు అర్పించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పల్నాడు జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వై రాధా కృష్ణ శ్రీహరిబాబు మృతికి జోహార్లు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.