- అమిత్ షా, బీరేన్ రాజీనామాలు కోరండి : ఎన్‌ఎపిఎం వినతి
న్యూఢిల్లీ : మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆదివాసీ రచయితలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం లేఖ రాశారు. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 86 మంది గిరిజన రచయితలు లేఖపై సంతకాలు చేశారు. ''సువిశాలమైన, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశానికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు సహాయం చేయాలి'' అనిదేశంలోని కోట్లాది మంది గిరిజనుల తరపున... ఆల్ ఇండియా ఫస్ట్ నేషన్స్ (స్వదేశీ, ఆదివాసీ) రచయితల సదస్సు విజ్ఞప్తి చేసింది.
గత రెండు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని గిరిజన రచయితలు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొను దుస్థితికి సంబంధించి మే 4న కుకీ గిరిజన మహిళలను బందీలుగా చేసి, క్రూరంగా హింసించిన వీడియో దేశంలోని 700కుపైగా గిరిజన సంఘాలను మాత్రమే కాకుండా మొత్తం పౌర సమాజానిు దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఆదివాసీ సాహితీవేత్తలమైన తాము ఈ హీనమైన, అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తునాుమని పేర్కొనాురు. గిరిజన మహిళలపై క్రూరమైన దాడికి పాల్పడిన ప్రత్యక్ష, పరోక్ష నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అత్యునుత నేత, భారత కొత్త రాజ్యాంగంపై చర్చ జరిపిన రాజ్యాంగ సభ్యులు జైపాల్ సింగ్ ముండా ప్రజాస్వామ్య దేశంలో గిరిజనులు సమానత్వం, శాంతితో జీవించే హక్కును పొందాలని అన్నారని గుర్తు చేశారు. ఆదివాసీలు భారతదేశ సృష్టికర్తలు, మూల నివాసులు అని లేఖలో గుర్తు చేశారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఐదవ, ఆరవ షెడ్యూళ్లలోని నిబంధనలను నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. తమ హక్కులను కాపాడుకోవాలనుకునే, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనుకునే గిరిజనులపై క్రూరమైన, అమానుషమైన దాడులకు దిగుతున్నారని పేర్కొనాురు. ఇటువంటి అమానవీయమైన సంఘటనలు ఏ పౌర సమాజానికైనా అవమానకరమని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన అత్యంత హేయమైన నేరాలని లేఖలో పేర్కొన్నారు.
- మణిపూర్‌లో పర్యటించండి... అమిత్ షా, బీరేన్ రాజీనామాలు కోరండి : రాష్ట్రపతికి ఎన్‌ఎపిఎం వినతి
మే 4న మణిపూర్‌లో కుకీ యువతులపై జరిగిన లైంగిక దాడిని నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ఎన్‌ఎపిఎం) తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక చర్యలపై విచారణ జరిపేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది. రాష్ట్రంలో పర్యటించి స్వయంగా పరిస్థితిని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్రపతికి ఎన్‌ఎపిఎం ఓ లేఖ రాసింది. పర్యావరణవేత్త మేథా పాట్కర్, మాజీ అధికారి హర్ష్ మందర్, కవి మీనా కందసామి సహా 3,256 మంది ఆ లేఖపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పర్యటించే నిజనిర్ధారణ బృందాలు, శాంతి కమిటీలు ఎటువంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా వ్యవహరించే వాతావరణం కల్పించాలని వారు ఆ లేఖలో కోరారు. రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఏకపక్షంగా ఎటువంటి అదనపు చేర్పులు చేయకుండా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 'మే 4న జరిగిన అమానుష ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు తీవ్రమైన జాప్యం చేశారు. గిరిజన మహిళ అయిన మీరు రాష్ట్రంలో పర్యటించండి. స్వయంగా పరిస్థితిని తెలుసుకోండి. ప్రభుత్వం నిస్సిగ్గుగా విభజన రాజకీయాలు చేయడం దురదృష్టకరం. క్షమించరాని నేరం. విద్వేషపూరిత నేరాలు అడ్డూ అదుపూ లేకుండా సాగేందుకు సాయపడింది. ఆ నేరాలకు పాల్పడిన వారిని శిక్షించకుండా వదిలేసింది. దారుణ వైఫల్యాలకు నైతిక, చట్టపరమైన బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా అమిత్ షా, బీరేన్ సింగ్‌లను కోరండి' అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
మణిపూర్‌లో పనిచేసే పౌర సమాజ బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి బెదిరింపులు రాకుండా చూడాలని, అవి స్వేచ్ఛగా తమ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎన్‌ఎపిఎం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో అలజడికి ప్రభుత్వ ప్రేరేపిత హింసే కారణమంటూ మణిపూర్‌లో పర్యటించిన భారత మహిళా కమిషన్ జాతీయ సమాఖ్య సభ్యులు నిర్ధారించారని, వారి పైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేసింది. రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై కొనసాగుతున్న నిషేధాన్ని రాష్ట్రపతి దృష్టికి తెచ్చింది. సంఘటన జరిగిన మే 4వ తేదీనే తన దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాతీయ మహిళా కమిషన్ జాప్యం చేసిందని విమర్శించింది.