ప్రపంచంలో జరుగుతున్న వేగవంతమైన మార్పుల కారణంగా డిజిటల్ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో సాంకేతిక అభివృద్ధి చాలా ముందుకొచ్చింది. ఒకప్పుడు పోస్టు ద్వారా ఉత్తరం అందుకోడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు మెయిల్ అందుకోడానికి ఒక సెకన్ కూడా పట్టడంలేదు. కూరగాయలు కొనడానికి కూడా యుపిఐ సాంకేతికత వాడుతున్నాం. ఈ నేపథ్యంలో 2023లో ట్రెండింగ్‌లో వున్న టాజీ టెక్నాలజీల గురించి క్లుప్తంగా...
నిమిషానికి 175 వెబ్‌సైట్లు...
ప్రస్తుతం ప్రపంచంలో 1.13 బిలియన్ (1,132,268,801) వున్నాయి. ప్రతి నిమిషానికి 175 వెబ్‌సైట్లు సృష్టించబడుతున్నాయి. ప్రతి గంటకూ 10,500, ప్రతిరోజూ 2,52,000, ప్రతి క్షణానికి 3 కొత్త వెబ్‌సైట్‌లు సృష్టించబడుతున్నాయి. కాగా, ఇంటర్నెట్‌లో 50 బిలియన్ల కంటే ఎక్కువ వెబ్ పేజీలు వున్నట్లు ఒక అంచనా.
ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్..
సాఫ్ట్‌వేర్ రంగంలో ఊపందుకుంటున్న తాజా టెక్నాలజీ ట్రెండ్ ఇది. ఐఓటి (ఇంటర్నెట్ ఆప్ థింగ్స్) సాంకేతికత ఊపందుకుంటున్న క్రమంలో వెబ్‌సైట్ లేదా అప్లికేషన్ ఫ్రంట్‌ఎండ్, బ్యాక్‌ఎండ్ సాంకేతికత మొత్తం ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కిందకు వస్తాయి. ఇప్పుడు చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు సమగ్రమైన యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. దీనికి వెబ్ డెవలప్‌మెంట్, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్స్‌పై అవగాహన అవసరం. దీనికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
సైబర్ సెక్యూరిటీ..
ప్రపంచం డిజిటల్‌గా మారుతున్న కొద్దీ.. సైబర్ సెక్యూరిటీ మరింత ముఖ్యమైనదిగా మారుతోంది. వ్యాపారాలు, వ్యక్తులు.. సైబర్ దాడుల నుంచి తమను తాను రక్షించుకోడానికి సిద్ధంగా వుండాలి. సాఫ్ట్‌వేర్ లేదా మరేదైనా హ్యాక్ చేయబడితే.. దీని పరిష్కారం కోసం సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఎంతైనా వుంటుంది.
ఎడ్జ్ కంప్యూటింగ్ ..
ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది సాఫ్ట్‌వేర్ పరిశ్రమలోని తాజా సాంకేతికతలలో ఒకటి. ఇది నెట్‌వర్క్ చివరలో, డేటా జనరేటర్‌కు దగ్గరగా వుంటుంది. విశ్వసనీయమైన, వేగవంతమైన డేటా ప్రోసెసింగ్ అవసరం ఈ ట్రెండ్‌ను నడిపిస్తోంది. అనేక వ్యాపారాలు ఇప్పటికీ తమ అప్లికేషన్స్ కోసం క్లౌడ్ కంప్యూటింగ్‌పైనే ఆధారపడుతున్నాయి. ఇది ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటింగ్.
ఇంటర్నెట్ బిహేవియర్ ..
ఇంటర్నెట్ ఆఫ్ బిహేవియర్స్ అనేది సాంకేతికతలో కొత్త ఆవిష్కరణల రూపం. ఇది ఇంటర్నెట్‌కు అనుసంధానించబడిన పరికరాల నుండి పొందిన డేటా వినియోగాన్ని సూచిస్తుంది. సేకరించిన డేటాను విశ్లేషించడానికి, ట్రాక్ చేయడానికి, అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
బ్లాక్‌చైయిన్..
బ్లాక్‌చెయిన్ అనేది పంపిణీ చేయబడే డేటాబేస్. ఇది లావాదేవీలు సురక్షితంగా, పారదర్శకంగా వుండటానికి అనుమతిస్తుంది. ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ మొదలైన రంగాలలో దీని అవసరాన్ని గుర్తిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని వ్యాపారాలు ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.