Apr 30,2023 16:17
  • పిడుగుపాటుకు భయపడి గ్రామంలోకి వచ్చిన గొర్రెల కాపరులు
  • లబోదిబోమ్మంటున్న గొర్రెల యజమానులు

ప్రజాశక్తి-చిప్పగిరి : కర్నూల్ జిల్లా చిప్పగిరి మండలంలో ప్రతి సంవత్సరం పిడుగుపాటుకు గొర్రెలు మరియు కాపరులు కూడా మృత్యువాత పడుతూనే ఉన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఉరుము మెరుపులతో పెద్ద గాలులు వీస్తూ వర్షం ప్రారంభమైందని స్థానికులు తెలుపుతున్నారు. ఆ సందర్భంలో ఒక్కసారిగా పిడుగులు ఉదృతంగా శబ్దాలు వచ్చాయి. ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా పిడుగు పడి ఉంటాదని స్థానికులు అనుకున్నారు. అనుకున్నట్లే నగర డోన పంచాయతీలోని మజార గ్రామమైన తిమ్మాపురం గ్రామ సమీపంలో 34 గొర్రెలు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాయని కాపరులు తెలిపారు. గొర్రెల కాపరులు సమాచారం మేరకు కొత్తపేట భీమన్నకు చెందిన 15 గొర్రెలు తిమ్మాపురం గ్రామానికి చెందిన సీను, జయరాముడు, హుస్సేన్ సాహెబ్, సురేష్ వీరందరివి 19 గొర్రెలు మృత్యువాత పడ్డాయని కొన్ని జీవాలు వంకలో కొట్టుకుపోయి, మరికొన్ని ఇసుకలో తేలి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం దయవుంచి  గొర్రెల యజమానులను ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.