
ఒక ఊరిలో పింకి, పాంకి, డాంకి అనే మూడు కుక్కలు ఉండేవి. అవి ఒకరోజు అలా ముందుకు వెళ్తున్నాయి. అప్పుడు కుక్కలు పట్టేవాడు అక్కడికి వచ్చాడు. అతడు వస్తున్నాడని ముందే గ్రహించిన పింకి మిగిలిన వాటిని హెచ్చరించింది. కానీ, అవి పట్టించుకోలేదు. పింకీ అక్కడ నుంచి వెళ్లిపోయింది. కుక్కలు పట్టేవాడు వాటి దగ్గరకు వచ్చేసరికి పాంకీ చనిపోయినట్టుగా నటించింది. అది నిజంగా చనిపోయిందనుకుని కుక్కలు పట్టేవాడు దాన్ని వదిలేశాడు. డాంకీకి కొంచెం తెలివితక్కువ. అందుకే అది కుక్కలు పట్టేవాడి నుంచి తప్పించుకోలేక పోయింది.
పి. భవ్యశ్రీ
7వ తరగతి, రఘుమండ,
జిల్లా పరిషత్ పాఠశాల, విజయనగరం