Oct 22,2023 09:28

తెలంగాణ : 1.6 కిలోమీటర్ల పొడవు గల మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులలో మొదటిదైన మేడిగడ్డ బ్యారేజీలోని నాలుగు పిల్లర్లు(18, 19, 20, 21) ఒక అగుడు మేర కుంగిపోయాయి. శనివారం రాత్రి  జరిగిన ఈ ఘటనతో అక్కడకు చేరుకున్న నీటిపారుదల అధికారులు పరిస్థితిని పరిశీలించారు. శనివారం చీకటి, నీరు ఉండడంతో నదిలో పిల్లర్ పరిస్థితి ఏంటో తెలియడం లేదని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. వంతెన చుట్టు ప్రక్క ప్రాంతాల్లో అలర్ట్‌ ప్రకటించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. రాత్రివేళ మహారాష్ట్రకు వెళుతున్న వాహనదారులు వంతెన కుంగిపోయిన విషయాన్ని గుర్తించి బయటకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.