ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : పెరవలి మండలం తీపర్రు సెంటర్ నర్సాపురం - నిడదవోలు కాలువ పై నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంగింది. ప్రతినిత్యం తాడిపర్రు ఉండ్రాజవరం వెలగదురు తణుకు టౌన్ కి వెళ్లటానికి అక్కడి ప్రజలకు ఈ రోడ్డు మార్గం దగ్గరగా ఉంటుంది. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పెనుగొండ నియోజకవర్గం అప్పటి సిపిఐ మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ హయాంలో నిర్మించారు. ప్రతినిత్యం పెరవలి ఉండ్రాజవరం మండలాల వాహనదారులు, లారీలు, ప్రయాణికులు ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తారు. భారీ ఇసుక వాహనాలు ఈ రోడ్డుపైనే వెళ్లేవి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు పూర్తిచేయాలని పలువురు కోరుతున్నారు.