Aug 20,2023 13:42

కాలం ఎంత చెడ్డదో కదా...!!
అందమైన పూల వానను సైతం
ఎండుటాకుల తుపానులా మారుస్తుంది
కలిసి నడిచిన దారులలోనే
ఒంటరిగా ప్రయాణించేలా చేస్తుంది
తెలిసిన ముఖాలను
తెలియని ముఖాలుగా చేసి
ఒకటే నగరాన్ని
గ్రహాంతర ప్రదేశాన్ని చేస్తుంది
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కదా!
ఈ కాలాన్ని వెనక్కి తిప్పి
నడిచిన దారులలోనే మళ్ళీ నడవాలని
ప్రేమగా ఆలింగనం చేసుకున్న ఆ చేతులను
మళ్ళీ ప్రేమతో తాకి
హృదయాన్ని మెలెయ్యాలని..
ప్రస్తుతానికి ముందుకు వెళ్ళడమే తప్పా
వెనక్కి వెళ్ళడం తెలియని
ఈ కాలంలో..
నిద్రలోనైనా కలల తీరంలో
విలువైన సమయాన్ని
తృప్తిగా గడపాలి
 

- సయ్యద్‌ ముజాహిద్‌ అలీ
77299 29807