
ప్రజాశక్తి - ఉండ్రాజవరం: బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా పేరి కామేశ్వరరావు నియామకంపై ఉండ్రాజవరం శ్రీ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ వాసిగా అపారమైన రాజకీయ అనుభవం కలిగిన పేరి కామేశ్వరరావును రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రాహ్మణ సంక్షేమానికి చేస్తున్న పథకాలు అర్హులందరికీ సకాలంలో అందేలా చైర్మన్ సేవలందిస్తారని ఆశిస్తున్నట్లు కోరారు. ఈ కార్యక్రమంలో దోనేపూడి సుధాకర్, ఈ సత్య కృష్ణ, డి. శ్రీరాం పవన్, కే గోపాల కృష్ణమూర్తి, కే సత్యనారాయణ, రాపర్తి వెంకటరామయ్య, పొట్ల చెరువు సోదరులు, తదితరులు పాల్గొన్నారు.