Sep 20,2023 15:51
  •  మందడం రైతు శిబిరం వద్ద జగన్ కు వ్యతిరేకంగా రైతుల నినాదాలు

ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బుధవారం మంత్రివర్గ సమావేశంకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయంకు మందడం రైతు దీక్షాశిబిరం ముందు నుండి వెళుతున్న సమయంలో రైతులు నినాదాలు చేస్తూ రోడ్డుపైకి రావడానికి యత్నించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. సిఎం కాన్వాయ్ వెళ్ళే వరకూ రైతులు,మహిళలు రోడ్డుపైకి రాకుండా తాళ్ళతో అడ్డుగా నిలబడ్డారు. మే నెలలో ఇవ్వాల్సిన కౌలు ఇంతవరకు చెల్లించ లేదని, రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న సిఎం రాజీనామా చెయ్యాలని, మా కొద్దీ రాక్షస పాలన అంటూ ప్ల కార్డులు, నల్ల జెండాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు  నినాదాలు చేశారు.వృద్దులు,చిన్నారులు సైతం నిరసన తెలిపారు. అనంతరం రైతులు శిబిరంలోకి వెళ్ళి యధావిధిగా దీక్షలు కొనసాగించారు.