- 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటన సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ విజయనగరంలోని కస్పా మున్సిపల్ హైస్కూల్‌లో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను, అర్ కె ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంతో సహా ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డిఇఒ బి.లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
- 10 మంది ఉపాధ్యాయులకు షోకోజ్ నోటీసులు
గత శనివారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్‌కు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు, మధ్యాహ్నం పూట గైర్హాజరైన మరో ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు.
- ఇద్దరు ఎంఇఒలకు, కస్పా హెచ్‌ఎంకు ఛార్జ్ మెమోలు?
మరో వైపు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటనలో సరిగా విధి నిర్వహణ చేయడం లేదంటూ ఆయన ఆదేశాల మేరకు విజయనగరం మండల ఒకటి, రెండు ఎంఇఒలకు, కస్పా హైస్కూల్ హెచ్‌ఎంకు ఛార్జ్ మెమోలు జారీ అయినట్లు తెలిసింది.