Apr 21,2023 16:57

ప్రజాశక్తి-గుంటూరు : ప్రశ్న పత్రాలు మూల్యాంఖనం కోసం వచ్చిన ఉపాధ్యాయడు గుండె పోటుతో మృతి చెందారు. ఫిరంగిపురం మండలంకు చెందిన పి.జొజ్జప అనే ఎస్.జి.టి ఉపాధ్యాయడు రొంపిచర్ల మండలం పరిధిలోని ఎస్.సి కాలనీలో గల ఎం.పి.పి.ఎస్ పాటశాల లో మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా నేడు శుక్రవారం పదవ తరగతి ప్రశ్న పత్రాల మూల్యాంకనం కోసం పట్టణ పరిధిలోనీ సెయింట్ ఆన్స్ పాటశాల కు వచ్చిన అయన కు గుండెలో నొప్పి తో బాధ పడుతూ ఒక్క సారిగా కింద పడిపోయారు. తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు అని వైద్యులు తెలిపారు.