- అట్లూరు తెలుగుదేశం పార్టీ నాయకుల స్పష్టం
ప్రజాశక్తి-అట్లూరు : క్రాస్ రోడ్ లోని కస్తూరిబా పాఠశాల పక్కనే ఉన్న 943, 944 సర్వే నెంబర్ లోని సుమారు 70 సెంట్లు స్థలాన్ని స్థానిక వైకాపా నాయకుడు జెసిపితో చదువును చేసి ఆక్రమణలకు అడుగులు వేస్తుంటే రెవిన్యూ అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు. వారు ఆక్రమించిన సుమారు కోటికి పైగా విలువయ్యే భూమిని వెంటనే రెవిన్యూ అధికారులు స్పదినపరుచుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలోనే ఈ స్థలాన్ని ఇతరులకు కబ్జా కాకుండా ప్రభుత్వానికి కేటాయింపబడి ఉంది. వెంటనే స్థానిక తాసిల్దార్ శ్రీవాణి సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని, ఇతరులు స్వాధీన పరుచుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శనివారం ఆక్రమిత స్థలాన్ని వారు బృందంగా వెళ్లి పరిశీలించారు. స్థానిక తాసిల్దారు వెంటనే స్వాధీన పరుచుకోకపోతే మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని మండల తెలుగు యువత అధ్యక్షుడు జయ కృష్ణారెడ్డి హెచ్చరించారు. 2017-18లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విలేజ్ పార్క్ మరియు మార్కెట్ యార్డ్ నిర్మించేందుకు ఈ స్థలం కేటాయింపబడి ఉంది. ప్రజా ప్రయోజనాలకే ఉపయోగపెట్టాలని ఆక్రమించుకునేందుకు కాదని వారు స్పష్టం చేశారు. ఈయన వెంట యూత్ నాయకులు సుధాకర్ రెడ్డి గంగిరెడ్డి నరసారెడ్డి మస్తానయ్య రిషికేశవతదితరులు ఉన్నారు.










