Oct 19,2023 12:06

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ టిడిపి, జనసేన, సిపిఐ నాయకులు జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. కాల్వ చివరి భూములకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి అంబటి రాంబాబు రైతాంగాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. మంత్రి అంబటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం  ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈఈ మురళీధర్ కు వినతి పత్రం అందజేశారు. జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు, సిపిఐ నాయకులు నరిశేట్టి వేణుగోపాల్, జై భీమ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఎమ్మార్పీఎస్ నాయకులు జంగాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.