- మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని
ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్రానికి 2024లో తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని కాకినాడ మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తెలిపారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 2024 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన భవిష్యత్తు గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ప్రచార సందర్భంగా మినీమ్యానిఫెస్టో ప్రచురించిన కరపత్రాలను స్థానిక 29వ డివిజన్ పెద్ద మార్కేట్ నందు వ్యాపారస్తుల వద్దకు, ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందజేస్తూ ప్రభుత్వం విధానాలను బుధవారం ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ జగన్ అరాచక పాలనలో ప్రజలు విసుగెత్తిపోయి వున్నారన్నారు. జగన్ ను గద్దెను దించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ను ముఖ్యమంత్రి నీ చెయ్యటానికి ప్రజలు సిద్దంగా వున్నారాన్నారు. లోకేష్ పాదయాత్రలో ఇదే తేటతెల్లం అవుతుందని అందుకే యువగళం పాదయాత్ర జన ప్రభంజనమై సాగుతుందన్నారు.
జగన్ పాలన అంతా కబ్జా పాలన, అవినీతి పాలనా, పన్నుల మోత పాలనా, ధరల మోత పాలనతో ప్రజలకు భారంగా మారిందన్నారు. జగన్ మాయ మాటలతో మోసపోయిన వారికి భరోసా ఇస్తూ జగన్ ప్రభుత్వ బాధితులకు అండగా వుంటూ సాగుతున్న లోకేష్ పాదయాత్ర ప్రజా యాత్రగా మారిందన్నారు. ప్రజలు కూడా సమయం కోసం వేచి చూస్తున్నారని వైసీపిని ఇంటికి సాగనంపేందుకు సిద్దంగా వున్నారన్నారు.
వైసీపి అవినీతి, అరాచక పాలన వ్యతిరేకించి ఆ పార్టీ వారు సైతం తెలుగుదేశం పార్టీలో ఇటీవలే భారీ సంఖ్యలో చేరడం దీనికి నిదర్శమన్నారు.
భవిష్యత్తుకు గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ప్రకటించిన నాటి నుంచి పేదల నుండి విశేష స్పందన వస్తుందని భవిష్యత్తుకు గ్యారెంటీ పధకాల ద్వారా మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగుల జీవితాలు బంగారు బాటలుగా మారుతాయని ప్రజులు విశ్వసించారని రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రజా పాలన చేయడం ఖాయమని సుంకర పావని అన్నారు.










