Jul 16,2023 14:28

ప్రజాశక్తి-పెదకూరపాడు : పెదకూరపాడుకు చెందిన గోగులపాటి షైనీకి ఆదివారం టిడిపి ఆధ్వర్యంలో చదువు నిమిత్తం ల్యాప్టాప్ అందించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సూచన, సహకారంతో ఎన్నారై మాగులూరి భాను ప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షులు అర్తిమళ్ళ రమేష్, నరసరావుపేట పార్లమెంట్ డాక్టర్ సెల్ కార్యదర్శి గుడిపూడి చిన్నరాజు, తెలుగు యువత నాయకులు మేదరమెట్ల సౌమిత్, త్రిశక్తి పీఠం ఆలయ శాశ్వత ధర్మకర్త పొట్టి నాగమల్లేశ్వరరావులు సమకూర్చి అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి అప్పారావు, రఘు, గుడిపూడి బాబు పాల్గొన్నారు.