Jun 02,2023 15:58

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : తెలుగుదేశం పార్టీ నాయకులు టిడిపి నేత కోడెల శివరాంతో భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇన్చార్జి గా ప్రకటించటంపై టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. టిడిపి నేతలు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిలు కోడెల శివరాంతో భేటీ అయ్యారు. శివరాంతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కోడెల అనుచరులు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులును చుట్టుముట్టారు. కోడెల శివరాంకు అన్యాయం చేశారని మడ్డి పడ్డారు. కోడెల శివరాం ను బుజ్జగించేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు.