May 10,2023 12:42

ప్రజాశక్తి-మంత్రాలయం : మండల పరిధిలోని రచ్చుమర్రి గ్రామ టిడిపి అధ్యక్షులు బండ్రాళ్ళ నరసింహ కుమారుడి వివాహ వేడుకలకు టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి హాజరయ్యారు. బుధవారం ఆ పార్టీ మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి తో కలిసి గ్రామానికి చేరుకున్న వారికి నరసింహులు శాలువతో పూల మాలలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వాదించారు.  ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, చావిడి వెంకటేష్, మాజీ ఎంపిటిసి సభ్యులు అమర్నాత్ రెడ్డి, చిలకలడోణ హనుమంతు లక్ష్మారి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.