Apr 15,2023 15:22

ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో సాక్షి మరియు సోషల్ మీడియాలో దళితులపై వచ్చిన కథనంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ యూవగళం పాదయాత్రలో దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో మరియు సాక్షి దినపత్రికలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ఫిర్యాదులను తిరగతోడతాం అంటూ మండిపడ్డారు.