- పులివెందుల ఇన్ చార్జు బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి
ప్రజాశక్తి - వేంపల్లె : రానున్న ఎన్నికల్లో గేలేచేది టిడిపి పార్టీ ననే కాబట్టి వైకాపా ప్రభుత్వానికి చరమ గీతం పాడేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని టిడిపి పులివెందుల నియోజకవర్గ ఇంఛార్జీ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లెలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో వేంపల్లె, వేముల, చక్రాయపేట మండలాలలోని క్లస్టర్ ఇంఛార్జీలు, యూనిట్ ఇంఛార్జీలు, బూత్ ఇంఛార్జీలకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఇంటిగ్రేటెడ్ కోఆర్డినేటర్ హర్షవర్దన్ నాయకులకు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం పులివెందుల ఇన్ ఛార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వైకాపా పాలనలో ప్రశాంతత లేక పోవడంతో సామాన్య ప్రజానీకం కూడ భయాందోళనకు గురి అవుతున్నట్లు చెప్పారు. టెలిగ్రామ్, టిడిపి యాప్, ఓటర్ వెరిఫికేషన్, హౌస్ మ్యాపింగ్ పై నాయకులు, కార్యకర్తలు దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపిని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల తనిఖీ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొనాలని సూచించారు. దొంగ ఓట్లు తెలుసుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఏజెంట్ లకు కూడ అవగాహన ఉంటుందని శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1179 కోట్లతో అమ్మబడి నిధులు విడుదల చేసినట్లు సిఎం జగన్ బటన్ నోక్కి చెప్పడం జరిగిందని కాని ఇంకా 50 శాతం తల్లుల ఖాతాలో పడలేదు అన్నారు. చీని రైతులకు కూడ భీమా సోమ్ము బ్యాంకు ఖాతాల్లో పాడలేదని చెప్పారు. డబ్బులు పడని లబ్ధిదారుల జాబితాను తీసుకొని వారి నుంచి సిఎం జగన్ రెడ్డీపై చెక్కు బ్రౌన్స్ కేసు పెట్టాతామని చెప్పారు. రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడడానికి అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. బీసీలను అణచివేయడం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లింపు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామని గుర్తించిన వైసీపీ చివరికి దొంగ ఓట్లు చేర్పించడం లాంటి నీచమైన పనులు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ నిమ్మకాయల దర్బార్, మైనార్టీ మండల కన్వీనర్ తెలంగాణ వలి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, జయచంద్రారెడ్డి, మహమ్మద్ ఇనాయతుల్లా, జిల్లా ఉపాధ్యక్షులు జగన్నాథరెడ్డి, రామగంగిరెడ్డి, తూగట్ల రాఘవరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవి కుమార్, పీరా సాహెబ్, ఆక్కుల విజయ కుమార్, జబిబుల్లా, డక్కా రమేష్, టివి శ్రీనివాసులు, చక్రాయపేట కన్వీనర్ మహేశ్వరరెడ్డి, వీరబద్ర, నిమ్మకాయల షాకీర్, మహబూబ్ షరీఫ్, గొటూరు నాగభూషణం, శేషారెడ్డి, వేముల మండల కన్వీనర్ బ్రహయ్య, వేమా, ఈశ్వరయ్య, గొగుల మల్లికార్జునతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.










