Oct 28,2023 12:33

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని తంటికొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి దళిత సీనియర్ నాయకుడు పల్లా నరసయ్య (61) శనివారం మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగిన దళిత నాయకుడు పల్లా నరసయ్య మండలంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పార్టీలో పలు ఉన్నత పదవులు నిర్వహించిన పల్లా నరసయ్య అకాల మృతి పట్ల మండలంలోని పలువురు నాయకులు దాసరి రమేష్ , సుంకర వీరబాబు బడిరెడ్డి రాంబాబు, పెద్దాడ వెంకన్న దొర, మడికి మైనర్ బాబు, బడిరెడ్డి బాబి, బదిరెడ్డి అచ్చన్న దొర, గునిపె భరత్, బదిరెడ్డి రవి తదితరులు  తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.