Aug 03,2023 08:10
  • అక్టోబర్‌ 1నుంచి అమలు

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలనే నిర్ణయానికి జిఎస్‌టి కౌన్సిల్‌ కట్టుబడి ఉంది. అక్టోబర్‌ 1 నుంచి దీనిని అమలు చేయాలని బుధవారం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నిషేథం ఉన్న రాష్ట్రాల్లో ఈ పన్ను విధించబడదని నిబంధనలను సవరిస్తా మని చెప్పారు. సిక్కిం, గోవా విధానాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రసుత్త పార్లమెంట్‌ సమావేశాల్లోనే జిఎస్‌టి చట్టానికి సవరణలు చేస్తామని సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారా మన్‌ తెలిపారు. కేంద్ర జిఎస్‌టి చట్ట సవరణతో పాటు కొత్త పన్నుల అమలు కోసం రాష్ట్రాలు కూడా తమ జిఎస్‌టి చట్టాలను సవరించు కోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.