
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ వర్చువల్ సమావేశం బుధవారం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్ చేస్తున్న వారికి నేటి సమావేశం కీలకం కానుంది. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశంలో నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, వాటి జజుఉలు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనివల్ల కొత్త తరం స్టార్టప్‌లకు ఇబ్బందులు ఎదురవుతాయని కంపెనీలు వాదించాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న జీఎస్టీ సమావేశం... ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై మంత్రుల బృందం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.