
చోడవరం : చోడవరంలోని అన్నవరం అంబేద్కర్ కాలనీలో దీపావళి సందర్భంగా తారాజువ్వలు కడుతుండగా శనివారం అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దాడ మహేష్ (20), శివలంక నిఖిల్ (13)చ తలారి జ్యోతిష్ (13) గాయపడ్డారు. ముగ్గురూ కలిసి ఇంట్లో బాణసంచా తయారుచేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురికీ కాళ్లు, చేతులు, ముఖంపైన గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జ్యోతిష్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.