Nov 07,2023 08:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దీపావళి సెలవు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నవంబరు 12న దీపావళి సెలవుగా ప్రకటించగా, ఇప్పుడు దాన్ని నవంబరు 13కు మార్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా సెలవులు కలిసొచ్చాయి.