May 26,2023 16:29
  •  జిల్లా క్రీడా శాఖ సీఈఓ పి.వి రమణ, 

ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్ : విద్యార్థులు తమకి ఇష్టమైన క్రీడలలో సాధన చేస్తే మంచిగా రాణించవచ్చని జిల్లా క్రీడా శాఖ సీఈఓ పి.వి రమణ, అన్నారు. శుక్రవారం స్థానిక అవుట్డోర్ స్టేడియం నందు స్టేడియం ఫుట్ బాల్ క్లబ్ అధ్యక్షుడు ముప్పా రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నగర స్థాయి అంతర్ ఫుట్ బాల్ పోటీలకు వారు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ రమణ మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు న్యాయవాది శ్రీధర్ రెడ్డి చేస్తున్న కృషి వేలకట్టలేనిదన్నారు, శ్రీధర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వ్యాపారవేత్త రామలింగప్ప ముందుకు రావడం అభినందనీయం అన్నారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు అంకితభావంతో ప్రతిరోజు సాధన చేస్తే తాము ఎంచుకున్న క్రీడారంగంలో రాణించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపాడు మాజీ ఫూట్ బాల్ క్రీడాకారుడు వేణుగోపాల్, ఈ పోటీల నిర్వాహకులు  రామలింగప్ప,  జిల్లా ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి అవినాష్ శెట్టి, పోటీల నిర్వాహక కార్యదర్శి బ్రహ్మకుమార్, వ్యయమ ఉపాద్యయులు  పాల్ విజయ్ కుమార్, రామకృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.