Apr 27,2023 15:37

ప్రజాశక్తి-కర్నూల్ స్పార్ట్స్ :  రెజిలింగ్ క్రీడాకారులపై లైంగిక  వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ నగరంలో రెజ్లర్ల క్రీడాకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప మాట్లాడుతూ భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలాగా రెజ్లర్ల మహిళా క్రీడాకారుల బంగారు, కాంస్య పథకాలను ఒలంపిక్ టిక్కో ఒలంపిక్ లో సాధిస్తుంటే వారికి అండగా నిలవాల్సిన జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బిజెపి ఎంపీ కంచె చేను మేసినట్లు కాపాడాల్సిన అధ్యక్షుడే వారిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న, వారి సమస్యలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారి పైన చర్య తీసుకోవాలని జనవరి నెలలో ఆందోళనకు దిగితే ప్రభుత్వం కమిటీ వేసి విచారిస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంతో ఐదు రోజుల కిందట ఏడు మంది మహిళా రెజ్లర్ల క్రీడాకారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం ఇది తీవ్రమైన ఆరోపణ తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చర్య తీసుకోవాలని ఆక్షేపించింది. అయినా సరే బిజెపి ఎంపీని కాపాడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారుణులపైన వారి కుటుంబ సభ్యులపైన దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడడం ఆర్థికంగా సహకరిస్తామని ఆశ పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. ఐదు రోజులుగా రాత్రి పగలు ఎండ వాన అనకుండా రెజ్లర్ల క్రీడాకారులు జంతర్మంతర్లు ఆందోళన చేస్తుంటే దేశవ్యాప్తంగా మేధావులు ప్రజాసంఘాలు ముఖ్యంగా మహిళ రైతు సంఘాలు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్ లాంటి మేధావులు మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అవడం లేదని అందుకే ఈరోజు ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సిఐటియు ఏఐకేఎస్ ఏఐఏడబ్ల్యుయు సంఘాలు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి తెలిపారు. బిజెపి ఎంపీలు మంత్రులు దేశంలో రోజు కొకరు లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్న బాధితుల పైన దాడులు చేసి చంపుతున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు దౌర్జన్యాలకు దాడులకు ప్రతికాగా బిజెపి నిలుస్తుందని ఆరోపించారు. తక్షణమే మోడీ ప్రభుత్వం రెజ్లర్ల ఆందోళనకు స్పందించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి తక్షణమే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూల్ లో కూడా క్రీడాకారిణిల వేధింపులు ఆదికమైనవని సర్టిఫికేట్ లు ఇస్తామని ఇండ్లకు తీసుకుని వెళ్లడం, బాలికలను బండ్లపై తిప్పదము, ఒక క్రీడా సంఘ నేత చేస్తున్నట్టు సమాచారం ఉంది అని తెలిపారు. వారి పైన కూడా డి.ఎస్.ఎ స్పందించి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర కర్నూలు న్యూ సిటీ మండల కార్యదర్శులు హుస్సేన్ బాషా యు ప్రకాష్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శంకర్ నాయకులు హరికిషన్ మధు ఐద్వ జిల్లా నాయకులు అమీనా నగర నాయకులు, సిఐటియు న్యూ సిటీ ఓల్డ్ సిటీ కార్యదర్శులు సిహెచ్ సాయి బాబా విజయ్ జిల్లా నాయకులు గోపాల్, రాముడు నాయకులు సుధాకరప్ప ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అమర్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.