- పి.నిర్మల
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ వీకర్ సెక్షన్ కాలనీలో మున్సిపల్ వర్కర్ మునెమ్మ సచివాలయాన్ని శుభ్రం చేస్తున్న సందర్భంగా కరెంట్ షాక్ తగిలి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. కర్నూలు జిల్లా సిఐటియు శ్రామిక మహిళా కన్వీనర్ పి.నిర్మల విద్యుత్ షాకు గురైన మునమ్మను ఆసుపత్రికి పోయి పరమార్శించడం జరిగింది. ఈ సందర్భంగా పి.నిర్మల మాట్లాడుతూ సచివాలయంలో పనిచేస్తూ విద్యుత్ షాక్ కు గురి అయిన మునెమ్మ కుటుంబాన్ని ఆదుకోవడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. విద్యుత్ షాక్ తగలడంతో చెయ్యి మొత్తం కందిపోయిందని ఆమెకు నెల రోజులు సెలవు ఇవ్వాలని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తులసమ్మ, ఏసమ్మ, అయ్యమ్మ, రాజేశ్వరి, నాగేంద్ర, రుతమ్మ ఆమని తదితరులు పాల్గొన్నారు.










