May 20,2023 16:38
  • కెవిపిఎస్ పిలుపు.

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : సుందరయ్య ఆదర్శ నేత అని ఆయన అడగాలో ప్రతి ఒక్కరు నడవాలని కె.వి.పి.ఎస్ . నగర గౌరవ అధ్యక్షులు ఆర్. నరసింహులు అన్నారు. శనివారం 23వ వార్డు శ్రీరామ్ నగర్ లో పుచ్చలపల్లి. సుందరయ్య 38వ వర్ధంతి కార్యక్రమం కెవిపిఎస్ వార్డు కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కెవిపిఎస్ వార్డు కార్యదర్శి పి.బాబురావు అధ్యక్షత వహించారు. మొదట పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి రిటైర్డ్ ఆఫీసర్స్ కెవిపిఎస్ నగర నాయకులు  వై.నల్లన్న, ఆర్ మద్దిలేటి లు పూలమాలవేసి నివాళులర్పించారు. కెవిపిఎస్ నగర గౌరవ అధ్యక్షులు ఆర్. నరసింహులు , కెవిపిఎస్ జిల్లా నాయకులు రోశయ్య లు కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ చల్లపల్లి సుందరయ్య చిన్నతనం నుండి దళిత బలహీన వర్గాల కొరకు నిరంతరం పోరాటం చేశారు. అంటరానితనం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సహపంతి భోజనాలు ఏర్పాటు చేయించారు. దళితులు బలహీన వర్గాలను త్రాగునీటి బావులలో నీళ్లు తీసుకునే విధంగా చేయటం కోసం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆయన పేరు పుచ్చలపల్లిసుందర్ రామిరెడ్డి అయితే ఆయన పేరు చివరన ఉన్నరెడ్డినితొలగించుకుని అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా చేరుకోవడానికి సుందరయ్యగా పేరు మార్చుకొన్న  గొప్ప వ్యక్తి, ప్రజలే తన బిడ్డలుగా భావించి తనను పెళ్లి చేసుకున్న తన భార్యను ఒప్పించి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుని ప్రజల కొరకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి సుందరయ్య. తెలంగాణ సాయుధ పోరాటంలో రైతులు రైతు కూలీల కొరకు రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి నిజాంనవాబునుగడగడలాడించి రైతులకు విముక్తిని కలిగించాడు. నిరాడంబరత, నీతి,నిజాయితీతో మచ్చలేని మనిషిలా, పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికీ తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేసిన మహా నాయకుడు ఇలాంటి మహా నాయకుడు అడుగుజాడల్లో మనమందరం పయనించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నగర కార్యదర్శి శేషాద్రి, రజక సంఘంఓల్డ్ సిటీ కార్యదర్శి శ్రీనివాసులు, కేవీపీఎస్ వార్డు నాయకులు కే.కిరణ్ కుమార్, వై తిమ్మన్న, ఎన్ పాండు, ఆర్. నల్లన్న సిపిఎం నాయకులు ఆర్ శేషం రాజు, ఎస్. అజ్మత్, టీ రంగయ్య మొదలగు వారు పాల్గొన్నారు