May 26,2023 15:34

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ : విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం పెంచుకొనుటకు కథలు చదవడం రాయడం అలవాటు చేసుకోవాలని మాధవపట్నం జమున నగర్ కాలనీ బాల మందిరం వ్యవస్థాపకులు అంగర గోపాల కృష్ణ (కృష్ణ శ్రీ) పిలుపునిచ్చారు. శుక్రవారం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం శ్రీ రామకృష్ణ సేవాసమితిలో జరిగిన సమ్మర్ క్యాంప్ లో కథలు రాద్దాం అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. బాలమందిరం వ్యవస్ధాపక కన్వీనర్ అంగర గోపాలకృష్ణ అవగాహన తరగతులు నిర్వహించి, విద్యార్థులచే కథలు రాయించారు. కార్యక్రమంలో వేట్లపాలెం సేవా సమితి నిర్వాహకులు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.