ప్రజాశక్తి - పెద్దాపురం : ప్రతి విద్యార్థి చిన్ననాటి నుండి నిత్యజీవితంలోని ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని జగ్గంపేట వాస్తవ్యులు లండ రాజు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో శనివారం ఆయన నిత్యజీవితంలోని సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నించటం, జవాబు తెలుసుకోవటం నిత్యజీవితంలో భాగం కావాలన్నారు. ఉపాధ్యాయుడు గుమ్మళ్ళ వీర వెంకటరావు మ్యాథమెటిక్స్ కు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు పుస్తకాల చదవటం, పాటల పాడటంలో శిక్షణ పొందారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు, కార్యాలయ సిబ్బంది బుల్లియ్య, మరియమ్మ, పాఠకులు పాల్గొన్నారు.










