May 27,2023 15:53

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యార్థులలో చదువు పట్ల ఆకర్షణ కలిగే విధంగా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఆట,పాట ,కథలు చెబుతూ వారిలో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి వారి ప్రతిభను గుర్తించి అందరిలో మెచ్చుకునే విధంగా సెహ్బాష్ అంటూ పొగుడుతూ  ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నట్లయితే పిల్లలు చదువు పట్ల ఆసక్తిని చూపుతారు. అప్పుడు వారు ఏది చెప్పినా వింటారని విశ్రాంత అధ్యాపకులు టిడి హుస్సేన్ పీరా, ఏ. హనుమంతప్పలు చెప్పారు. కర్నూలు జిల్లా గ్రంధాలయ సంస్థ కేంద్ర గ్రంధాలయం నందు ఈనెల 8వ. తేదీనుండి విద్యార్థులకు  జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం తరగతులలో బాగంగా శనివారం ఉదయం 8  గంటల నుండి మధ్యాహ్నం 12గంటలవరకు విద్యార్థులకు టీ డీ‌ ఉశ్శేన్ పీరా రిటైర్మెంట్ లెక్చరర్ చేత, గ్రంథాలయం అధికారులు వజ్రాల గోవిందరెడ్డి, యస్ భాష లచే,ఏ హనుమంతప్ప రిటైర్మెంట్ లెక్చరర్ గారిచే మరియు జనవిజ్ఞాన వేదిక సభ్యులు దామోదర్ చే విద్యార్థులలోనూతన చైతన్యం తీసుకుని రావడానికి,  చక్కని విజ్ఞానం కొరకు మంచి నడవడిక కోసం, చక్కటి ఆరోగ్యానికి మరియు వారి అభ్యున్నతికి చక్కని ఉపమాన కథలు చెప్పడం వారికి విన్పించడం విద్యార్థులచే చెప్పిస్తు పాటలు పాడించడం,  ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ తెలియజేస్తూ వారికి అర్థం అయ్యేలా తెలుపుచూ విద్యార్థులను విద్యపట్ల ఆకర్షణ కలిగి బాగా చదువు కొనేలా వారిలో ఆత్మవిశ్వాసం, చదువు మీద ఆశక్తి ని పెంచేలా పాఠాలు చెప్పుతూ వివరించారు.దామోదరం, హన్మంతప్ప ఆద్వర్యంలో విద్యార్థులకు క్యారమ్ బోర్డు, చేస్సు, లూడో , పరమపద సోపానం లాంటి ఇండోర్ గేమ్స్ ఆడించడం జరిగింది. ధారుడ్యం కొసం ప్రతి రోజు వ్యాయామం, యోగా మరియు ఆటలు ఆడటం నేర్పించారు. ఈ కార్యక్రమంల నందు విద్యార్థులు మరియు గ్రంథాలయాదికారులు వజ్రాల గోవిందరెడ్డి, యస్ భాష, ఈశ్వరమ్మ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.