Jul 12,2023 14:30
  •  క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా

ప్రజాశక్తి-కాకినాడ : దేశంలో విపత్తు నిర్వహణ రంగంలో విశేష సేవ‌లందించిన సంస్థ‌లు, వ్య‌క్తుల‌కు గుర్తింపునిస్తూ స‌త్క‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్ర‌బోస్ ఆప‌ద ప్ర‌బంధ‌న్ పుర‌స్కార్‌కు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 2023, ఆగ‌స్టు 31లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఇత‌ర వివ‌రాలు http://awards.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌క్తిగ‌త‌, సంస్థ‌ల కేట‌గిరీల కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సంస్థ అవార్డుకు ఎంపికైతే రూ. 51 ల‌క్ష‌లు, వ్య‌క్తిగ‌తంగా అవార్డుకు ఎంపికైతే రూ. 5 ల‌క్ష‌లు న‌గ‌దు పుర‌స్కారం ల‌భిస్తుంద‌ని వివ‌రించారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి అయిన 2024, జ‌న‌వ‌రి 23వ తేదీన మొత్తం మూడు న‌గ‌దు అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు.