ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదివి ఉన్నత శిఖిరాలు అధిరోహించాలని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు మీనా మాధురీ కోరారు.యువజన సర్వీసుల శాఖ,సెట్రాజ్ ఆద్వర్యములో సామర్లకోట జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో వ్యక్తిత్వ వికాసము మరియు విద్యా ఉద్యోగ అవకాశములు అంశముపై విద్యార్థిణిలకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భముగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనా మాధురీ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే కెరీర్ పైన దృష్టి సాధించడానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి,ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు పొందడానికి కెరీర్ గైడెన్స్ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ ఎ.సత్య శిరీషఆధ్వర్యములోయువతీయువకులకు వ్యక్తిత్వ వికాసము,విద్యా ఉద్యోగ అవకాశములపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో సెట్రాజ్ మేనేజర్ కె.ఎస్.వి.కాశీ విశ్వేశ్వరరావు,యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్సి.వి.సూర్యనారాయణ, ఫీల్డ్ ఆఫీసర్ కె.గౌతమ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.










