- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బండారు శివ
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బండారు శివ కార్యదర్శి .. ఆత్మకూరు మండలం గ్రామీణ ప్రాంతాల్లో పేదలను రక్షించడానికి ఉపాధి హామీ పనులను వెంటనే చేపట్టాలని వలసల నుండి రక్షించాలని గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరులోని సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండారు శివ, సిపిఐ ఆత్మకూరు మండల కార్యదర్శి సనప నీళ్లు పాల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకంనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని. వ్యవసాయ కూలీలు పేదలకు నెలకు పదివేల రూపాయలు కరువు పెన్షన్ తో పాటు 35 కిలోల బియ్యాన్ని ఇతర నిత్యావసర సరుకులను ఉచితంగా అందించాలన్నారు. పేద విద్యార్థుల అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని పేదల ఇళ్లకు వస్తున్న కరెంటు చార్జీలను, బకాయిలను రద్దు చేయాలన్నారు. రైతులు సాగు చేసిన పంటలకు అనుకూలంగా పంట నష్ట పరిహారము అందించాలన్నారు. అన్ని రకాల బ్యాంకు రుణాల రద్దు చేసి క్రొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను సచివాలయ అధికారులకు అందజేశారు. దీంతోపాటు ఆత్మకూరు నారాయణపురం చోలసముద్రము కమ్మూరు ఇప్పేరు తదితర పంచాయతీలో వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడునియోజకవర్గం ఉప అధ్యక్షుడు బి రామాంజనేయులు, ముత్యాల, హనుమన్న, మహిళా సమాఖ్య సరస్వతి, నారాయణమ్మ, గోవిందు, శంకరయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.










