- 591 మార్కులతో ప్రధమ స్థానం
- జిల్లాలో పెటేరు, పందిళ్ళపల్లి జడ్ పి హైస్కూల్ కు 591 మార్కులు
- ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు
ప్రజాశక్తి-రేపల్లె : పదవ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించి జిల్లాకు వన్నె తెచ్చారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలోని పెటేరు, పందిళ్ళపల్లి జడ్పి పాఠశాలల విద్యార్థులు 591 మార్కులతో జిల్లా టాపర్స్ గా నిలిచారు. మండలంలోని పెటేరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. పాఠశాలకు చెందిన జక్క యశ్వంత్ 591 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచాడు. బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్స్ లో ప్రధమ శ్రేణి మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచాడు. 579 మార్కులతో కొండ లోకేష్ ద్వితీయ స్థానం సాధించగా, మల్లిపెద్ది శ్రావ్య 572 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పావులూరి కృష్ణ మోహన మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 118 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు అయ్యారని తెలిపారు. వీరిలో 91 మంది విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించారని తెలిపారు. 500 మార్కులకు పైన సాధించిన విద్యార్థులు 16 మంది ఉండటం పాఠశాలకు గర్వకారణం అన్నారు. పాస్ పర్సెంటేజ్ ను తీసుకుంటే 77 శాతంగా ఉందన్నారు ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాదించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.










