May 07,2023 07:41

రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి అంటే
అక్కడ ఎన్ని వేల చెమట చుక్కలు రాలాయో
ఒక భవనం అంత సుందరంగా అబ్బురపరుస్తుందంటే మరిన్ని వెన్నెముకలు అలసి సొలసి పోయాయో

కడుపులోకి
కొన్ని మెతుకులు మెరిసి ఆకల్ని తీర్చుతూ
ఆకలికేకలు అదృశ్యం అయ్యాయి అంటే
ఏ రైతు శ్రమ పలితమో
దేశం దిగులును మరచి హాయి నిద్రను మోస్తోంది

శ్రమ తత్వం
దేశానికి ఊపిరిలూదే అద్భుత సూత్రం
కొండల్ని సైతం పిండిని చేసే
కార్మికుని శక్తి అజరామరం
దేశ ప్రగతికి తన రెక్కల కష్టం
ప్రగతిపథ సోపానం

శ్రమైక జీవనంలో కండలు కరిగినా
బలిష్టమైన ఎముకలతో
దేశ నిర్మాణాన్ని నిటారుగా నిలిపే
శ్రమ కిరీటి మన కర్షకుడు
పాలకులు వారి హక్కులకు తోడై నిలిచి నడిపిస్తే
దేశం మరింత శోభాయమానం

శ్రమను చిందించే శ్రామికుడు
రేపటి ఉషోదయాలకు
నవ సూరీడు అతడే మన శ్రామిక వీరుడు
శ్రామికుల్ని గౌరవిద్దాం, ఆదరిద్దాం
వారి శ్రమ వెనుక దాగిన కన్నీటి ద్ణుఖాన్ని తరిమేద్దాం
శ్రమశక్తి జిందాబాద్‌ అని నినదిద్దాం...!!

మహబూబ్‌ బాషా చిల్లెం
9502000415