ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) :రాజవొమ్మంగి మండలంలోని సింగంపల్లి గ్రామం సమీపంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి తీవ్రంగా గాయపడిన చుక్కల జింక మంగళవారం మృతి చెందినట్లు అటవీ శాఖ రేంజర్ ఎం.అబ్బాయిదొర తెలిపారు. ఆదివారం ఉచ్చులో పడి తీవ్రంగా గాయపడిన చుక్కల జింకకు ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది చికిత్స అందజేశారు. నడుము వద్ద తీవ్ర గాయం అవ్వడంతోనే జింక మృతి చెందిందని రేంజర్ తెలిపారు. మృతి చెందిన జింక కళేబరాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ కె బాలాజీ, ఎఫ్ బి ఓ, కె అప్పారావు, పశువైద్యాధికారి తరుణ్ పశు వైద్య సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.










