Nov 13,2023 13:03

స్నేహం అంటే వరం
ప్రతి స్నేహితునికీ
ఇదొక మంచి తరుణం
స్నేహానికి ఇదొక
మంచి తరం
స్నేహమే లేకపోతే
పెద్ద మరణం
స్నేహితం
మనకు జీవితం
స్నేహితునికివ్వాలి
మనం అంకితం
నా మిత్రుడు అంటే
నాకెంతో ఇష్టం
తాను లేని జీవితం
నాకెంతో కష్టం
మా స్నేహం అంటే
మాకు ఇష్టం
మా స్నేహానికి
జరగనివ్వం నష్టం
కలిసి ఆడాం.. పాడాం..
కలిసి చదివాం..
స్నేహంతోనే
మంచిగ మారాం
మేము కలిసి మెలిసి ఉన్నాం
అందుకే అన్నింటా గెలిచాం
అల్లరి పనులు చేశాం
గొడవలు ఎన్నో జరిపాం
అయినా మేం కలిసి మెలిసే ఉన్నాం
అందుకే స్నేహితుడంటే
నాకు ప్రాణం
స్నేహితుడే నాకు
బంగారు నాణెం!
యు. కైలాష్‌
10వ తరగతి,
అరవింద మోడల్‌ స్కూల్‌
మంగళగిరి,
గుంటూరు జిల్లా