కలం కత్తెరగా మలిస్తేనే
జబ్బు పడ్డ వ్యవస్థకు శస్త్రచికిత్స
రాతికి జీవం ఉంటుంది
మనసుపెట్టి శిల్పంగా
మలిచి చూడు..!
ఉదయానికి స్పృహ ఎక్కువ
ఎన్ని హృదయాలనో
మేల్కొలుపుతుంది!
పుస్తక పుటలలో అక్షర కాంతి
ఎన్ని జీవితాలకి వెలుగిస్తుందో!
ఎప్పుడూ ఒంటరినని అనుకోకు
నీ అంతర్ముఖం నీతోనే!
జీవితంలో ఎన్ని మెట్లెక్కినా
కింది మెట్టును మరచిపోకు..!
- కయ్యూరు బాలసుబ్రమణ్యం, 77802 77240