తర్కానికి అందనిది అందం
తాత్వికతకు లోబడనిది ప్రకృతి
అది ఎంత సహజమైనదో
అంత స్వచ్ఛమైనది !
మనం అనే భావనతో
మనసు హద్దుల్ని చెరిపితే
ఎల్లెడలా వ్యాపించే సూర్యకాంతిలా
భాసిస్తుంది జీవన గమనం !
రంగురంగుల శోభాయమానంతో
రసమయ ధునితో నిండిన జగతిని
నిండుగా నింపుకుని మత్తావిగా
నిలుస్తుంది మనసు !
ప్రతి నువ్వు నేనే అంటాయి
తరతమ భేదం లేని పంచభూతాలు
పరిమితమైన వైయక్తికంతో
పరమతం కూడా పడని మనిషి
మనం అనుకోలేక అంటున్నాడు
''యుద్ధం శరణం గచ్చామి''
- కావూరి శారద
7780357378